![]() |
![]() |
.webp)
రీతూ చౌదరి.. ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న నటి. రీతూ.. తన కెరీర్ ని ఒక మ్యూజిక్ ఛానెల్ లో యాంకర్ గా మొదలు పెట్టింది. అంతేకాకుండా యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా చేసిన పెళ్లి చూపులు షోకి వచ్చి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం రీతూ జబర్దస్త్ లో చేస్తోంది. అంతేకాకుండా 'ఇంటిగుట్టు' సీరియల్ లో నెగెటివ్ రోల్ లో యాక్టింగ్ చేసి అందరిని మెప్పించిన విషయం తెలిసిందే. అప్పట్లో యాంకర్ విష్ణుప్రియ, రీతూ కలిసి బ్యాంకాక్ బీచ్ లో సందడి చేసిన ఫోటోస్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
రీతూ చౌదరి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తనకి విపరీతమైన సింపతీ లభించింది. ఆ తర్వాత పలు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఒకవైపు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో, మరొక వైపు జబర్దస్త్ షోలో నటిస్తూ బిజీగా ఉంటోంది రీతూ. అయితే తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేసింది. ఫోటోషూట్ లతో ఇన్‌స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంటూ, ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉంటోంది.
ఇన్‌స్టాగ్రామ్ లోని సెలబ్రిటీలలో చిన్న, పెద్ద అని తేడా లేకుండా దాదాపు అందరూ.. 'ఆస్క్ మి క్వశ్చనింగ్' అంటూ నెటిజన్లతో ఇంటరాక్ట్ అవుతుంటారు. వారు పంపే ప్రశ్నలన్నింటిలో కొన్నింటికి సమధానం చెప్తూ ఎప్పుడూ లైంలైట్‌లో నిలుస్తుంటారు. అలాంటిదే ఇప్పుడు రీతూ చౌదరి చేసింది. తరచూ హాట్ ఫోటోలతో ట్రెండింగ్ లో ఉండే రీతూ.. తాజాగా "నిజాలు మాట్లాడుకుందామని" పెట్టింది. దాంతో ఒక్కొక్కరు ఒక్కోలా క్వశ్చనింగ్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారని ఒకరు అడుగగా.. షూటింగ్ అంటూ తను ఉన్న షూటింగ్ లోకెషన్ వీడీయో పెట్టింది రీతూ చౌదరి.
"పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు?" అని ఒకరు అడుగగా.. "డోంట్ మ్యారీ బీ హ్యాపీ" అంటు రిప్లై ఇచ్చింది రీతు. "బ్రతికేదే అబద్ధపు జీవితం.. నిజాలు అంటూ ఏం లేవు సిస్టర్" అని ఒకరు మెసేజ్ చేయగా.. "అది కూడా కరెక్టే" అని రీతూ చౌదరి రిప్లై ఇచ్చింది. "నీకు లవర్ ఉన్నాడా?" అని మరొకరు అడుగగా.. లేడని చెప్పింది. మీకు తెల్లవెంట్రుకలు ఎన్ని ఉన్నాయని ఇంకొకరు అడిగితే, ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే చిరాకు వస్తుందని, తనది కలర్ హేయిర్ అని రీతూ చౌదరి చెప్పింది. "ఎవరినైనా లవ్ చేస్తున్నారా? అని వేరొకరు అడిగితే.. "లవ్ కి ఒక దండం, కానీ నన్ను నేను బాగా లవ్ చేసుకుంటా" అని సమాధానమిచ్చింది. ఇలా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది రీతూ చౌదరి.
![]() |
![]() |